నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన ఎస్ఎల్బీసీ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కళాశాల మొత్తం కలియ తిరుగుతూ కళాశాల ప్లాన్ ను పరిశీలించారు. ఇంకా ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ముందే సరి చేసుకోవాలని, అవసరమైన హాల్ ఏర్పాటు చేయాలని సూచించారు.