నల్గొండ: పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం

62చూసినవారు
నల్గొండ: పూలే స్ఫూర్తితో మూఢనమ్మకాల నిర్మూలన కృషి చేస్తాం
గొప్ప సంఘ సంస్కర్త, చదువు ప్రాధాన్యతను గుర్తించినవాడు, కుల వివక్షను, మూఢనమ్మకాలను వ్యతిరేకించిన మహాత్మ జ్యోతిబాపూలే స్ఫూర్తితో కార్మికుల్లో ఉన్న మూఢనమ్మకాల వ్యతిరేకంగా చైతన్య పరుస్తామని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అన్నారు. శుక్రవారం నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్