సమాజ మనుగడ కోసం సహజ వనరులను రక్షించుకోవడానికి శాస్త్ర విజ్ఞానాన్ని వినియోగించుకోవాలని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ శేఖర్ రెడ్డి అన్నారు. గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నల్గొండ డైట్ కళాశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ టెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు సైన్స్ పరిజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ప్రకృతి మార్పుల్ని అధ్యయనం చేయాలని అన్నారు.