కనగల్ మండల కేంద్రంలోని అగ్రోస్, పర్వతగిరి NDCMSలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయ అధికారి అమరేందర్ గౌడ్ శుక్రవారం తెలిపారు. విత్తనాలు కావలసిన రైతులు పట్టాదార్ పాస్ బుక్, ఆధార్ కార్డ్ జిరాక్స్ ప్రతులను తీసుకొని కనగల్ రైతు వేదిక వద్ద ఆన్ లైన్ చేసుకోవాలన్నారు. 30 కేజీల బస్తా రూ. 2138 ఉందని తెలిపారు.