మిర్యాలగూడ: వీరజవాన్ మురళీ నాయక్ కు కాంగ్రెస్ ఘన నివాళి

69చూసినవారు
మిర్యాలగూడ: వీరజవాన్ మురళీ నాయక్ కు కాంగ్రెస్ ఘన నివాళి
వీరజవాన్ మురళీ నాయక్ కు మిర్యాలగూడలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి కొవ్వొత్తులతో ప్రదర్శన, ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మిర్యాలగూడకు చెందిన వీర జవాన్ మురళి నాయక్ కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఘనంగా నివాళులర్పించారు. స్థానిక గాంధీ విగ్రహం నుండి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్