నల్గొండ: 'ముస్లిం, మైనార్టీ స్థితిగతులపై సర్వే నిర్వహించాలి'

69చూసినవారు
నల్గొండ: 'ముస్లిం, మైనార్టీ స్థితిగతులపై సర్వే నిర్వహించాలి'
ముస్లిం మైనార్టీ స్థితిగతులపై సర్వే నిర్వహించి ప్రత్యేక సబ్ ప్లాన్ అమలు చేయాలని యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ తాజుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనార్టీ యువతీ యువకులకు బ్యాంకులతో సంబంధం లేకుండా 100% సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, వక్ఫ్ బోర్డులో మిగిలి ఉన్న భూములను నిరుపేద ముస్లిం మైనార్టీలకు ఇంటి స్థలాల కోసం కేటాయించాలన్నారు.

సంబంధిత పోస్ట్