నల్గొండ: ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందిన మహోన్నత వ్యక్తి అంబేద్కర్

57చూసినవారు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కలెక్టర్ ఇలా త్రిపాటి, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, ఎమ్మెల్సీలు నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి చెందిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన రాసిన రాజ్యాంగ ఫలాలతోటే అన్ని వర్గాల వారు ఉన్నత పదవుల్లో ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్