ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో భారీ వర్షం కురవనుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నల్గొండ జిల్లాలో శుక్రవారం సా.5:50 నుంచి రాత్రి 8:00 గంటల వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా ఇప్పటికే 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే.