నల్గొండ పట్టణంలోని అరుంధతి మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి భాష పాక చంద్రశేఖర్ అత్త విమలమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం విమలమ్మ దశదినకర్మలో తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.