రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయని నల్గొండ జిల్లా తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ అధ్యక్షులు జిల్లపల్లి ఇంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే విధంగా చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీంతో నిరుపేదలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలుగుతుందని, కార్పొరేట్ ఫీజుల భారం తగ్గుతుందన్నారు.