నల్గొండ: మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్‌లో భారీ చేరికలు

57చూసినవారు
నల్గొండ: మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్‌లో భారీ చేరికలు
నల్గొండ జిల్లా కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో 19వ వార్డు కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 200 మంది కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, మాజీ చైర్మన్ సైదిరెడ్డి, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్