ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి తన కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా శ్రీహరికి కోమటిరెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల సమస్యలపై ఎనలేని అనుభవం కలిగిన నేతగా ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడతాయని.. ఆ నమ్మకం తనకు ఉందని కోమటిరెడ్డి అన్నారు. నూతన బాధ్యతల్లో ఆయనకు అన్ని విధాలా విజయాలు కలగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.