నల్గొండ: వనపర్తి వెంకయ్య భౌతిక దేహానికి నివాళులర్పించిన కంచర్ల

69చూసినవారు
నల్గొండ: వనపర్తి వెంకయ్య భౌతిక దేహానికి నివాళులర్పించిన కంచర్ల
నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తిప్పర్తి మండలం రాయినిగూడెం మాజీ ఎంపీటీసీ వనపర్తి సైదులు తండ్రి వనపర్తి వెంకయ్య మరణించడంతో శుక్రవారం వారి భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారివెంట తిప్పర్తి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి, నల్గొండ పట్టణ పార్టీ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, లక్ష్మయ్య, వనపర్తి జ్యోతి ఉన్నారు.