బీహార్ మాజీ ముఖ్యమంత్రి బీపీ మండల్ 43వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బ గోని రమేష్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికై విద్యా ఉపాధి రంగాల్లో 27% రిజర్వేషన్ అమలుకై ప్రభుత్వానికి నివేదిక అందజేసి బీసీల పితామహుడు అని ఆయన సేవలను కొనియాడారు.