ఆర్టీసీ నల్గొండ జిల్లాలోని అన్ని డిపోలలో వివాహాది శుభకార్యాలకు అద్దెకు బస్సులు అందజేస్తామని గురువారం ఉమ్మడి నల్గొండ జిల్లా రీజనల్ మేనేజర్ కె. జాన రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సులను అద్దెకు తీసుకోవచ్చున్నారు. ప్రతి కిలోమీటర్ పై గతంలో కంటే రూ. 7 తగ్గింపు ఉందని, 6 గంటల వెయిటింగ్ చార్జ్ మినహాయింపు ఉంటుందన్నారు.