ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి ఈ నెల 16న సీఎం రేవంత్ రెడ్డి 'రైతు నేస్తం' కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా సాగు, ఆధునిక పంటలు, సేంద్రియ ఎరువుల వినియోగం, తక్కువ నీటితో పంటల సాగు తదితర అంశాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు ఈ కార్యక్రమంలో తగిన సూచనలు చేస్తారని ఆమె వివరించారు.