బ్రెయిలీ చిన్న మొలలతో చక్కపైన తయారు చేసిన అక్షరాలను తాకడం ద్వారా అందుల కోసం ప్రత్యేక లిపిని కనిపెట్టినారని, బ్రెయిలీ సేవలు చిరస్మరణీయమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వికలాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఐతగోని శేఖర్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా శనివారం నల్గొండ మండలంలోని అబ్బాయిపేట గ్రామంలో లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.