నల్గొండ జిల్లాలో అనర్హులకు అందుతున్న పింఛన్లపై ప్రభుత్వం సోషల్ ఆడిట్ నిర్వహించనుంది. ఈ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ సోషల్ ఆడిట్తో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు బయట పడుతున్నాయి. ఇదేవిధంగా పింఛన్ల పైనా సోషల్ ఆడిట్ నిర్వహిస్తే అనర్హులకు అందకుండా చూడొచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది.