తెలంగాణ ఉద్యమకారులను 11 సంవత్సరాల అయినప్పటికీ గుర్తించక పోవడం విచారకరమని తెలుపుతూ శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపిన అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీజేఎస్ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, జేఏసీ నాయకులు నరసింహాచారి మాట్లాడుతూ తెలంగాణ సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి గుర్తింపు కార్డులను అందజేసి 250గజాల ఇంటిస్థలాన్ని కేటాయించాలని కోరారు.