మేడ్చల్ జిల్లా కండ్లకోయ సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ బాత్ రూంలో రహస్యంగా కెమెరాలను అమర్చిన ఘటనలో బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ మలిదశ ఉద్యమకారుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.