నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీ నివాసం వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు తిరుగమల్ల షాలెమ్ రాజు పాల్గొని రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పచ్చటి పొలాలకు, అందమైన జీవనానికి ప్రతీక అయిన హోలీ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నల్గొండ జిల్లా ప్రజలు ప్రజలందరికీ హృదయపూర్వక హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.