నల్గొండ పట్టణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాటైన గణేష్ ఉత్సవ సమితి నల్లగొండ నగర కార్యాలయాన్ని గురువారం ఆర్ఎస్ఎస్ విభాగ్ సంఘ సంచాలక్ గార్లపాటి వెంకటయ్య, ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి విజయకుమార్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 7వతేదీ నుండి ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.