ఎస్ ఎల్ బి సి ఏ ఎమ్ ఆర్ పి ఒకటవ టన్నెల్ ఔట్లెట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తో కలిసి ఎస్ఎల్బీసీ ఏఎమ్ఆర్పి ఒకటవ టన్నెల్ ఔట్ లెట్ ను సందర్శించారు. ముందుగా జిల్లా కలెక్టర్ ప్రాజెక్టు ఇంజనీర్లు, ప్రాజక్ట్ నిర్మాణం చేపట్టిన నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు.