నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి - డివైఎఫ్ఐ నేత కోట రమేష్

82చూసినవారు
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలి - డివైఎఫ్ఐ నేత కోట రమేష్
నల్గొండ పట్టణంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో మంగళవారం యువజన సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ పరీక్షలు వెంటనే వాయిదా వేయాలన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్ట్ లను పెంచాలని కోరారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు అన్నింటిని భర్తీ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :