మాతా శిశుమరణాలను తగ్గించడాన్ని సవాల్ గా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్ లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. సాంకేతికంగా ఎంతో ముందుకెళుతున్నప్పటికీ అవగాహన లోపం, మూఢనమ్మకాల కారణంగా ఇంకా అక్కడక్కడ గ్రామీణ ప్రాంతాలలో ప్రసవం సందర్భంగా, ప్రసవానంతరం మాతా, శిశు మరణాలు సంభవించడం బాధాకరమని అన్నారు.