త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబరు7 సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ ప్రారంభం అవుతుందన్నారు