చిట్యాల మండలం సుంకెనపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం విద్యార్థిని విద్యార్థులు స్వపరిపాలన దినోత్సవం జరుపుకున్నారు. హెచ్ఎం గా శ్రీనిధి, ఎంఈఓ గా కావలి విజయ్ కుమార్, ఉపాధ్యాయులుగా దిలీప్, అనిల్, శివ, సాహితి పాత్రలను పోషించారు. పాఠశాల హెచ్ఎం శాంతకుమారి, టీచర్లు కల్పన, అహల్య, విద్యావాలంటీర్ రాధిక పాత్రలను పోషించిన వారిని అభినందించారు.