నల్గొండ: విద్యార్థినులు కష్టపడి చదివాలి
విద్యార్థినులు బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినిలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, వారికి నోట్ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లను పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ విద్యార్తినిలతో ముఖాముఖి మాట్లాడుతూ బాగా చదువుకోవాలని అన్నారు.