దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి

58చూసినవారు
ఈ నెల 12వ తేదీన ఎబివిపి సిద్దిపేట జిల్లా కన్వీనర్ సావుల ఆదిత్య పైన గుర్తు తెలియని దుండగులు దాడి చేయడాన్ని ఎబివిపి రాష్ట్ర శాఖ తీవ్రంగా ఖండిస్తుందని యూనివర్సిటీ అధ్యక్షులు హనుమాన్, కార్యదర్శి మోహన్ అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఇది ఒక పిరికి పంద చర్య అని అన్నారు. ఈ దేశంలో విద్యార్థులలో ఎబివిపి పై ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక ఈ దాడికి పాల్పడినట్టు ఎబివిపి భావిస్తుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్