తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని క్యాబినెట్ లో తీసుకున్న నిర్ణయం హర్షణీయమని మునుగోడు చేనేత సహకార సంఘం డైరెక్టర్ బొల్ల పరమేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ ఏర్పాటుకి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.