కార్మికులను కట్టు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ ను రద్దు చేసేవరకు మోడీ ప్రభుత్వం పై కార్మికవర్గం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని అందులో భాగంగా జులై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్ పిలుపునిచ్చారు. శనివారం దొడ్డి కొమరయ్య భవన్ లో సీఐటీయూ నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జరిగింది.