వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది భార్య. ఈ ఘటన గట్టుప్పల్ మండలం వెల్మకన్నె గ్రామంలో ఈ నెల 10న చోటు చేసుకోగా. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టి నిందితులిద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి గురువారం విలేకరులకు వెల్లడించారు. ఈ విచారణలో హేమలత, ఆమె ప్రియుడు నవీన్ కలిసి పథకం ప్రకారమే మల్లేష్ హతమార్చినట్లు నిర్ధారణ కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.