క్షయ వ్యాధి స్క్రీనింగ్ పరీక్షలు పెంచాలని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన “ జిల్లా టిబి ఫోరం” సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025- 26 నాటికి జిల్లాలో టి బి లేకుండా చూడాలని అన్నారు. ఇందులో భాగంగా టిబి పరీక్షలను వేగవంతం చేయడం, గుర్తించిన వారికి సరైన విధంగా చికిత్స అందించడం, గుర్తించిన ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాలలో సైతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా టి బి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు.