నల్గొండలో నీరు కలుషితం

67చూసినవారు
నల్గొండలో నీరు కలుషితం
నల్గొండ పురపాలక సంస్థ సరఫరా చేస్తున్న తాగునీరు సురక్షితమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. కాలం చెల్లిన పైపులైన్లకు తోడు తరచూ లీకేజీల కారణంగా శుభ్రమైన నీరు రావడంలేదని పలు వార్డుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రెండు మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో కొళాయిల ద్వారా కలుషిత నీరు వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఈ నీరు ఎలా తాగాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్