రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని గొల్లగూడ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు అన్నారు. శనివారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గొల్లగూడ ఆధ్వర్యంలో దోమలపల్లి, అన్నేపర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామన్నారు.