సావిత్రిబాయి ఫూలే జయంతి వేడుకలను కతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ దండంపల్లి సరోజ మాట్లాడుతూ.. అనాదికాలంగా వస్తున్న దురాచారాలను ఎండగడుతూ భావిభారత మహిళలకు అక్షర జ్ఞానం నేర్పిన సావిత్రిబాయి ఫూలే ఆశయాలు కొనసాగించాలని అన్నారు.