నాగార్జున ప్రభుత్వ కళాశాల ఫిజిక్స్ డిపార్ట్మెంట్, యూత్ ఫర్ సేవ స్వచ్ఛంద సామాజిక సంస్థతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బుధవారం ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం యూత్ ఫర్ సేవ, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు అయినటువంటి విద్యా వైద్యం, జీవనోపాధి, పర్యావరణ కార్యక్రమాలపై సమాజ హితం కోసం పని చేయడం జరగనున్నదని తెలిపారు.