కేంద్ర బడ్జెట్ కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించకుండా బిజెపి ప్రభుత్వం వివక్ష చూపించిందని డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా టిపిసిసి పిలుపు మేరకు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ లో పార్టీ శ్రేణులు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేశారు.