తెలుగు వర్సిటీ పేరు మార్పు.. సీఎం రేవంత్ కీలక ప్రాతిపాదన

61చూసినవారు
తెలుగు వర్సిటీ పేరు మార్పు.. సీఎం రేవంత్ కీలక ప్రాతిపాదన
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా చివరి రోజు పలు బిల్లులపై వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం పేరు మార్పును సభలో సీఎం రేవంత్‌‌రెడ్డి లేవనెత్తారు. విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప‌రెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు. రాష్ట్ర విముక్తిలో సురవరం పాత్రను ప్రభుత్వం కీర్తిస్తుందని అన్నారు. అందరూ అంగీకరిస్తే.. తెలుగు విశ్వ విద్యాలయానికి సురవరం పేరు పెట్టేందుకు ఎలాంటి అభ్యతరం లేదన్నారు.

సంబంధిత పోస్ట్