హైదరాబాద్‌లోని నాంపల్లి హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ హత్యకేసులో మరో సీసీటీవీ ఫుటేజ్ బయటికి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకొని హత్యకు సంబంధించి ప్రశ్నిస్తూ విచారిస్తున్నారు. కాగా, నాంపల్లిలో గురువారం నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో నరికి చంపారు.