నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కొత్త లుక్ వైరల్‌గా మారింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ తొలి సినిమా వస్తుండగా ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. తాజాగా ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ న్యూలుక్‌కు సంబంధించిన ఓ ఫొటో షేర్ చేసి ‘సింబా ఈజ్ కమింగ్’ అని హ్యాష్‌ట్యాగ్ జత చేశారు. మోక్షజ్ఞ కొత్త లుక్ చూసి బాలకృష్ణ అభిమానులు ఫిదా అవుతున్నారు.