హీరో నాని నటిస్తున్న 'HIT–ది థర్డ్ కేస్' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. సోమవారం ఉదయం విశాఖలోని సంగం థియేటర్లో ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ ఓ పోస్టర్‌ను SMలో విడుదల చేశారు. ఉదయం 11.07 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుంది.