AP: గొప్ప సంఘ సంస్కర్త, తెలుగుజాతి గర్వించదగిన మహోన్నత వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ మహనీయుడని జయంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు. ‘తాను నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించారు. తొలి వితంతు వివాహం, తొలి సహవిద్యా పాఠశాలను ప్రారంభించి మహిళల జీవితాల్లో వెలుగులు నింపారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం పునరంకితం అవుదాం’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.