స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఉత్తమ గ్రామ పంచాయతీ గా అడ్డాకుల గ్రామపంచాయతీ ఎంపికైంది. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి చేతుల మీదుగా గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీవో, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శి అందుకున్నారు.