మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి జాతర ప్రాంగణం సమీపంలోని ఓ వెంచరలో సోమవారం సాయంత్రం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం లభిమైనట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మహిళ వయస్సు సుమారు 40 నుంచి 50 మధ్యలో ఉంటుందని, బ్లాక్ కలర్ సెటర్ ధరించిందన్నారు. మృతదేహాన్ని గుర్తుపడితే సంబంధిత పోలీసులకు 8712659354, 8712659316 నంబర్లను సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు.