బీఆర్ఎస్ ప్రజల సంక్షేమాన్ని విస్మరించిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. శనివారం గోపనపల్లిలో సీసీ రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.