ఓ వ్యక్తి దారుణ హత్య జరిగిన ఘటన గురువారం మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్ లో నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్ (36) తరచూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం కూడా మళ్లీ ఆమెను వేధించాడు. అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ.. అలీని రాడ్డుతో దారుణంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.