దేవరకద్ర: రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం

85చూసినవారు
దేవరకద్ర: రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం. చిన్న రాజమూర్ గ్రామానికి చెందిన బాదేపల్లి ఆంజనేయులు (52) దేవరకద్ర పట్టణ కేంద్రంలోని ఎస్సీ కాలనీ వద్ద తన అత్తగారి ఇంటికి వెళుతూ రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతి చెందాడు. మృతునికి చెవులు సరిగా వినపడవన్నారు. భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారన్నారు. రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్