మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ సమీపంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో శనివారం 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాస్తూ అత్యధిక మార్కులు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.