రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. జానంపేటలో 30 మంది రైతులకు ట్రాన్స్ ఫార్మర్ పంపిణీ చేశారు. జడ్చర్ల సబ్ డివిజన్ పరిధిలో గత 10 ఏళ్ళ బిఆర్ఎస్ పాలనలో 3 సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలోని ఐదు నూతన సబ్ స్టేషన్లను మంజూరు చేసి రైతులపై చిత్తశుద్ధిని చాటుకున్నామని అన్నారు. రూ. 30 కోట్ల నిధులతో మూసాపేటలో 132/11 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు.